బి.కొండేపాడు గ్రామంలో బొలిశెట్టి పల్లెపోరు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: పెంటపాడు మండలం, బి.కొండేపాడు గ్రామంలో బుధవారం జరిగిన పల్లెపోరులో రైతులను ఉద్దేశించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రైతులను ఇబ్బందుల పాలు చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, సబ్సిడీపై సూక్ష్మపోషకాలు, మైక్రో ఇరిగేషన్‌, భూసార పరీక్షలన్నింటినీ అటకెక్కించిందని దుయ్యబట్టారు. వ్యవసాయానికి అర్థం తెలియని మంత్రి ఇప్పుడు ఆశాఖకు ఉన్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిగూడెం నుంచి బి.కొండేపాడుకి నాలుగు సంవత్సరాల నుంచి రోడ్డు వేయించలేకపోవడం మన ఉపముఖ్యమంత్రికి సిగ్గుచేటుగా లేదన్నారు. ఒక బి కొండేపడే కాకుండా ఏ గ్రామంలో రోడ్డు వ్యవస్థ బాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, స్థానిక నాయకులు మండవల్లి మనీచైతన్య, అంబాటి రామచంద్రరావు, చిట్టులూరి దుర్గాప్రసాద్, పిల్లి బుల్లేశ్వర్రావు, పెరుమాళ్ళ సతీష్, తిరుపత పాతి సాయి, మర్రె విగ్నేశ్వర రావు, గూడూరి కొండబాబు, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, జనసేన నాయకులు గాజులు గోపికృష్ణ, బుద్ధన బాబులు జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, కొనకల హరినాథ్, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, లింగం శ్రీను, గోకు కిరణ్, పాలూరి బూరయ్యా, ఏపూరి సాయి, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, భార్గవ్, దంగేటి చందు, బత్తిరెడ్డి రత్తయ్య, వానపల్లి సాయిరాం, ములగాల శివ, ప్రసాద్, ద్వారబంధం సురేషు, నరాల శెట్టి సంతోష్ వీరమహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం వీర మహిళలు అడపా జమునా, మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.