రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో అకాల వర్షల కారణంగా వరి పంట దెబ్బతిన్న రైతులను గురువారం వారి దగ్గరికి వెళ్లి బొలిశెట్టి శ్రీనివాస్ ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ రెక్కల కష్టం నీటిపాలవుతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను చూసుకొని మురిసి పోయిన రైతులను, అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో అకాల వర్షంతో విక్రయించేందుకు సిద్దంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లోని చేతికి వచ్చిన పంట తడిసిముద్దయిపోయి ఆరపోసిన ధాన్యం వర్షార్పణం అవ్వటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని, ఈ ప్రాంతంలో ఎంత వర్షం వచ్చిన సమయానికి ధాన్యం రైతులు పట్టుబడి పట్టేవారు అని ఈ ప్రభుత్వం వల్ల ధాన్యం కొనుగోలులో అలసత్వం వల్ల అలాగే సరైన సమయంలో రైతులకు గోను సంచులు అందించకపోవడం వల్ల ఈ ధాన్యం తడిసి ముద్ద అయింది అని అలాగే ఒక రైతు ఈ నష్టాన్ని భరించలేక జనసైనికుల ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం, వెంటనే శ్రీనివాస్ ఆయన్ని ఆపడం జరిగింది. అలానే మొద్దునిద్ర వహిస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ ప్రభుత్వాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు గిద్ద సుబ్రమణ్యం, నారపురెడ్డి రాంబాబు, బందిరి కృష్ణ, మొగుడా పోశయ్య, నాయుడు, జనసేన నాయకులు అడపా ప్రసాద్, ఉప్పు నరసింహమూర్తి, బుచ్చిబాబు, మట్ట రామకృష్ణ, రామిశెట్టి సురేష్, పుల్లాబాబి, గుండుమొగుల సురేష్, వర్తనపల్లి కాశీ, యంట్రపాటి రాజు, మాదాసు ఇందు, మద్దాల మణికుమార్, అడ్డగర్ర సూరి, నల్లకంచు రాంబాబు, చాపల రమేష్, పిడుగు మోహన్, రౌతు సోమరాజు, బయనపాలేపు ముఖేష్, గట్టిం నాని, కుదేర్ల శీను, ఏపూరి సాయి, శ్రీరామ్, రాకుర్తి కిరణ్, కాకర్ల శివ, వీరమహిళలు పెనుబోతుల సోమలమ్మ, వేజ్జు రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.