మండలాద్యక్షునికి మనోధైర్యాన్నిచ్చిన బొలియశెట్టి శ్రీకాంత్

కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల పట్టణం కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షులు నాయని సతీష్ ఇటీవల తాడేపల్లిగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలవడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అయన కంచికచర్లలో తన నివాసములో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని ఆదివారం సాయంత్రం “కృష్ణా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్” మండల అధ్యక్షులు సతీష్ ని పరామర్శించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారని మండల అధ్యక్షులు సతీష్ కి ధైర్యం చెప్పి 5000 వేలు నగదు 50 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పుట్టా స్వరూప, పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్, తోట ఓంకార్, దేవేందర్, దేవిరెడ్డి అజయ్ బాబు, నరసింహ,. వెంకటేష్, షేక్ పెద్ద బాజీ, కనపర్తి సాయి, గీట్ల మురళి కృష్ణ, కంచేటి సాయి బాబా, సాయి హేమంత్, కొనపర్తి పద్మారావు, పుప్పాల వేణు, పలువురు కార్యకర్తలు సతీష్ ని పరామర్శించారు.