ప్రమాదంలో గాయపడిన కార్యకర్తకు అండగా బొలియశెట్టి శ్రీకాంత్

*ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ కార్యకర్తకు అండగా నిలబడిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

కవులూరు గ్రామానికి చెందిన నూతక్కి రాణి కి ఇద్దరు అబ్బాయిలు ప్రమాదంలో గాయపడ్డారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన నూతక్కి రాణి కొండపల్లిలో ఇందిరమ్మ కాలనీ లో అద్దెకు వుంటున్నారు. భర్త ఎనిమిది నెలల క్రితమే చనిపోయారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి. పెయింటింగ్ పనికి వెళ్తారు. రెండో అబ్బాయి ఊరిలో చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజులు క్రితం సొంత గ్రామం కవులూరు వెళ్లి ఇంటికి వస్తుండగా రోడ్లు సరిగా లేక గుంటలో పడి పెద్ద అబ్బాయి నూతక్కి జాన్ కి చెయ్యి విరిగింది. రెండో అబ్బాయి లక్ష్మణరావు కాళ్ళ దగ్గర నరం తెగి హాస్పిటల్ లో వున్నారు. ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పారు. సోమవారం ఆపరేషన్ చేస్తామని అన్నారు. రోజు కూలి పనిచేసే బ్రతికేవాళ్ళు ఈ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిల్చింది. రెండు నెలలు సరిపడే సరుకులు బొలియశెట్టి శ్రీకాంత్ కొండూరు మండల అధ్యక్షుడు యర్రబోలు నరసింహారావు చేతులు మీదగా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఆ కుటుంబానికి వైద్య ఖర్చులకు మా వంతు సహకారం అందిస్తామని శ్రీకాంత్ అన్నారు.

కొండపల్లి నుండి కవులూరు వెళ్లే రహదారి త్వరగా మరమ్మతులు చేపట్టాలని రోజు ఏదో ఒక గుంటలో పడి దెబ్బలు తగులుతున్నాయి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. ఆ రోడ్డులో ప్రయాణం చెయ్యాలంటే కవులూరు గ్రామ ప్రజలు భయపడుతున్నారు. త్వరగా రోడ్లు మరమ్మతులు చేపట్టాలని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ కి జనసేన పార్టీ తరుపున కోరుతున్నాం. లేనియెడల పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరుపున ధర్నా చేస్తామని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొండూరు మండల అధ్యక్షులు యర్రబోలు నరసింహ రావు, బత్తెన శ్రీనివాసరావు, యర్రంశెట్టి నాని, వై అనిల్ కుమార్, శ్రీనివాసరావు, తోట శివాజీ, జె కిశోర్, పార్థసారథి, జగదీష్, జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..