ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హఫీజ్ కు బొళియశెట్టి శ్రీకాంత్ పరామర్శ

  • వైద్య ఖర్చులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేత

ఇబ్రహీంపట్నం: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్తా ప్రభ రిపోర్టర్, ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హఫీజ్ ను జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు, వారాహి మీడియా కో- ఆర్డినేటర్, సెంట్రల్ ఆంధ్రా జోన్ కో – కన్వీనర్ బొళియశెట్టి శ్రీకాంత్ మంగళవారం పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.