పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

  • అగ్నిప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాజోలు నియోజవర్గం, రాజోలు మండలం రాజోలు గ్రామంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్కుట్ జరిగి ఆకుల విజయ్ టిఫిన్ హోటల్ పూర్తిగా దగ్ధమైంది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, రాజోలు గ్రామశాఖ అధ్యక్షులు కాట్రు రాజు, బి. సావరం వైస్ సర్పంచ్ రావూరి నాగు, అడబాల సిరి, రేఖపల్లి శ్రీను, అన్నపూర్ణ, కోళ్ళ బాబీ, మేకల ఏసుబాబు, దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్ జనసైనికులు పాల్గొన్నారు.

  • నామన నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, మగటపల్లి గ్రామంలో కీ.శే నామన నాగేశ్వరావు అకాల మరణం చెందినారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మాజీ జడ్పీటీసీ చైర్మన్ నామన రాంబాబు, నామన కిరణ్, కుంచె చిన్ని దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్ తదితరులు.

  • చింతా రామబాయి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో కీ.శే చింతా రామబాయి అకాల మరణం చెందినారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గ్రామాశాఖ అధ్యక్షులు ఇంటి మహీంద్ర, మట్ట సత్తిబాబు, ముస్కుడి నర్సింహా స్వామి, తోట త్రిమూర్తులు, దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్ తదితరులు.