మురారి నరేంద్రకు నివాళులర్పించిన బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మురారి నరేంద్ర మరణించిన వార్త తెలుసుకొని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, యువజన విభాగ అధ్యక్షుడు రుద్రజడ బుల్లబ్బాయి, సత్తెనపల్లి ఏడో వార్డు కౌన్సిలర్ సుమన్, సిరిగిరి ప్రసాదు, రుద్రారం జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ కొమర సుబ్బారావు, పులిచెర్ల ప్రసాదు, పులిచెర్ల రామ్మోహన్, కొమర పేరయ్య, కొమర నాగేశ్వరరావు, మెడి హరి బాబు, మండల కార్యదర్శి ఎస్.కె మదర్ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.