మిచౌంగ్ తుఫాన్ బాధితులను పరామర్శించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మిచౌంగ్ తుఫాన్ వలన నకరికల్లు మండలంలోని గ్రామంలో దెబ్బ తిన్న వరి పొలాలను శనివారం జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట్ అప్పారావు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ… మిచౌంగ్ తుఫాను వరి పంట రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు.తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు వరద తీవ్రత తగ్గిన అనంతరం పంట నష్టంపై అంచన వేసిన నష్టపోయిన రైతులకు నాయ్యం చెయ్యాలి అని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన టిడిపి సమన్వయ బాద్యులు బొర్రా వెంకట అప్పారావు అన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు జనసేన పార్టీ తరుఫున రైతుల పక్షాన నిలబడి రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. పంట నష్టం జరిగి రైతులు తీవ్ర ఆవేదనతో ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం అని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. రాష్ట్రంలో తుఫాను వలన రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే వెళ్లి పరిశీలించి వాళ్లకి ధైర్యం చెప్పి ఆర్థిక చేయూతని ఇవ్వవలసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పటివరకు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉంటే ఎలా..? మంత్రులు ఒక బస్సు వేసుకొని మళ్లీ జగనే ఈ రాష్ట్రానికి కావాలి అంటూ తిరుగుతున్నారు. ఆర్థికంగా నలిగిపోయిన రైతాంగాన్ని పరామర్శించినందుకా మళ్లీ జగన్ రెడ్డి కావాలి అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమములో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ, కసా రామకృష్ణ, పానుగంటి రామకృష్ణ, మిరియాల జగన్, నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకాపూర్ణ, నక్క వెంకటేశ్వర్లు, గదే సాంబ, షేక్ ఖాసిం, జనసైనికులు పర్యటించడం జరిగింది.