నకరికల్లు మండల సహాయ కార్యదర్శిని పరామర్శించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలంలోని నకరికల్లు గ్రామంలో మండల సహాయ కార్యదర్శి పుట్లగుంట శివరామకృష్ణ కి ప్రమాదవశాత్తు బైక్ పై వెళుతుండగా యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలయి చేతికి ఫ్రాక్చర్ అయినది ఈ విషయాన్ని నకరికల్లు మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ సత్తెనపల్లి నియోజకవర్గం నాయకులు బొర్రా వెంకట అప్పారావు కు తెలియజేయగా ఆయన తక్షణమే స్పందించి నకరికల్లులోని సహాయ కార్యదర్శి అయినటువంటి శివరామకృష్ణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, వారి ఆర్థిక పరిస్థితులను గమనించి జనసేన పార్టీ తరపు నుండి ఆర్థికంగా సహాయం చేయడం జరిగినది. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ తరఫు నుండి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల ప్రెసిడెంట్ తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, సత్తనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, గ్రామ సీనియర్ నాయకులు కాసా రామకృష్ణ, బండి వర్ధన్, పానుగంటి రామకృష్ణ, డి కొండ లక్ష్మీనారాయణ, వెంకయ్య, వేణు మరియు గ్రామ జనసైనికులు పరామర్శించడం జరిగినది.