జనసేన పార్టీ సంస్థాగత పఠిష్ఠతపై దృష్టి పెట్టిన బొర్రా!

  • బొర్రాకి బ్రహ్మరధం పట్టిన 18వ వార్డు జనసైనికులు!

సత్తెనపల్లి: జనసేన పార్టీని సంస్థాగతంగా పఠిష్ఠ పరిచేందుకు నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు నడుం కట్టారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొర్రా కృషి చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం 18వ వార్డులో సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేశారు. రానున్నది జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమేనని, ఆ మేరకు సత్తెనపల్లిలో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్ధి విజయానికి ప్రతి ఒక్కరు అరమరికలు లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకు గాను ఇప్పటి నుంచే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, నియోజకవర్గ సమన్వయ కమిటీ మాజీ సభ్యులు దార్ల శ్రీనివాస్, స్థానిక జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్ధి చింతల అరుణకుమారి, వెంకట్, పోకల శంకర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత బొర్రాకి స్థానిక జనసైనికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రమాదవశాత్తూ స్థానికంగా కాలికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న స్థానికుడు అన్నదాసు శ్రీనివాసరావుని బొర్రా పరామర్శించారు.