సమస్యలపై ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేయాలి: గాదె

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాల మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ ప్రతి మండలాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిపై ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేయాలి ఆ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ప్రణాళికలు కల్పించాలి. జనసేన పార్టీ, టిడిపి పార్టీలు కలిసి ప్రవేశపెట్టిన చేతి పత్రాలు (పాంప్లెట్స్)నీ మాత్రమే అందరూ జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి. రేపు జరగబోయే ఎలక్షన్లో మన పార్టీ తరపున బూత్ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ప్రతి మండలాలలో ఏ విధమైన సమస్య అయినా ఆ సమస్యను ముందుండి పరిష్కరించే బాధ్యత ప్రతి మండల అధ్యక్షులపై ఉన్నది కావున మీరు అందరూ మండలాలలో ఉన్న నాయకులను, కమిటీ సభ్యులను, గ్రామ అధ్యక్షులను అలాగే జిల్లా కమిటీ సభ్యులను కలుపుకొని ప్రతి కార్యక్రమానికి విజయం చేకూర్చే విధంగా మండల అధ్యక్షులు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా. మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, తోట రాజా రమేష్, మేకల రామయ్య యాదవ్, తడవర్తి కేశవ, సిరిగిరి శ్రీనివాస్, శిఖా బాలు పాల్గొన్నారు.