ఘనంగా ఏకలవ్య జయంతి

భైంసా : పట్టణంలోని నర్సింహ నగర్ లో ఎరుకల కులస్థుల ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకల కుల పెద్దలు, యువకులు జెండా ఎగురవేసి, మహనీయుడి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, మేధావులు పాల్గొని ప్రసంగించారు. ఆదివాసి, ఎరుకల (కుర్రు) ప్రజల చరిత్రకు మూలపురుషుడైనటువంటి ఏకలవ్యుడు మహాభారతంలోని అస్త్రశస్త్ర విలువిద్యలు నేర్చిన మహావీరుడు మన ఏకలవ్యుడు. ఏకలవ్యుడు పుట్టుకతోనే ఏకసంతగ్రాహి కలిగినవారు. విలువిద్యలలో ధనుర్విద్యను నేర్చుకోవాలనే కుతుహలంతో ద్రోణాచార్యుల గారి వద్దకు వెళ్ళి, గురువర్యులు ద్రోణాచార్యులను నాకు ధనుర్విద్యను నేర్పాలని కోరినాడు. కాని బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడు నీవు నిషాద కులానికి చెందినవాడివి, కనుక నీకు ధనుర్విద్యను నేర్పించను అని నిరాకరించినాడు. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో బాధతో వెనుదిరిగినాడు. అయిన పట్టువదలకుండా ధనుర్విద్యను నేర్చుకోవాలని ద్రోణాచార్యుని ప్రతిమను నెలకొల్పి, దాని ముందు సాధన చేసి, ధనుర్విద్యను సాధించినాడు. ద్రోణాచార్యుడు అక్కడికి వెళ్ళి చూడగానే నిషాద రాజైనటువంటి విలువిద్యలను సాధన చేస్తూ ఏకలవ్యుడు కనిపించినాడు. అది చూసి ద్రోణాచార్యుడు ఈ విద్యలన్ని ఏలా సాధ్యమైనాయి అని అడిగినాడు. అయ్యా తమరి ప్రతిమను గురువుగా బావించి సాధన చేసాను. అన్ని విద్యలను ఒంటపట్టించుకున్నాను అన్నాడు. ద్రోణాచార్యుడు నీవు నా శిష్యునివే అంటున్నావు కదా నాకు గురు దక్షణ ఇవ్వగలవా అని ప్రశ్నించగా ఏకలవ్యుడు గురు దక్షణ సమర్పించగలను కోరుకొమ్మనగా, ఏకలవ్యుని కుడి చేతి బ్రొటన వేలును గురుదక్షణగా ఇవ్వమని ద్రోణాచార్యుడు అడిగినారు. తక్షణమే తన కుడి చేతి బ్రోటన వేలును కోసి గురుదక్షణగా సమర్పించిన మహావీరుడు ఏకలవ్యుడు. కాని నేటి సమాజంలో అలాంటి త్యాగాలకు విలువ లేకుండా పోతుంది. యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్య జయంతి నీ అధికారికంగా ప్రకటించి, సెలవు దినంగా పాటించాలని కోరారు. అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి, పాఠ్యాంశాల్లో చేర్చాలని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన ఎరుకుల కులానికి భూమి, అన్ని సంక్షేమ పథకాల్లో అర్హులను చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆదివాసి ఎరుకల (కుర్రు) కులానికి చెందిన యువకులు, గజ్జు, సుభాష్, లక్ష్మణ్, నరెంధర్, గణేష్ కుంసార, నవీన్ శ్రీకాంత్, సాయి, మహేష్ కుంసార, సాయినాథ్ రాజు, శ్రీనివాస్, పోషెట్టి, శేషారావు, నరేష్, ప్రముఖ లాయర్ శంకర్, అర్ ఎస్ ఎస్ నాయకులు దామోదర్, లింగం, శ్రీనివాస్, హిందువాహిని సభ్యులు మహేష్, రాజు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తలోడ్ శ్రీనివాస్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.