చీరాల జనసేన ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

చీరాల, డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం తరఫున వేటపాలెం సెంటర్, దేవంగపురి పంచాయతీ, శృంగారపు పేట – వాడరేవు, ఈపురుపాలెం బాయ్స్ హై స్కూల్, తోటవారిపాలెం, కారంచేడు గేట్, ముక్కోణపు పార్క్ ఆయా ప్రాంతాల్లో ఉన్న ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పవనన్న చీరాల నియోజకవర్గ యువత ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లీగల్ చైర్మన్ కస్తూరినాథ్, కర్ణ కిరణ్ తేజ, కట్టా వినయ్ కుమార్, షేక్ బాషా, గొర్ల రఘురాం, రోహిత్, అలా శ్రీధర్, తోట రాజ్ కుమార్, బాసి పైడియ, బుద్ధి శ్రీహర్ష, సోమిశెట్టి కిరణ్, బత్తిన బాలాజీ, సల్లురి విజయ్ బాలు, పల్లపోలు పవన్ కుమార్, మల్లికార్జున, కగడల శివ శంకర్, కేంబురి రమణ, చనపతి ధనుంజయ్, పైల విజయ్, వరం బూడిద మరియు వీరమహిళ కారంపూడి పద్మిని పాల్గొన్నారు.