బీజేపీ- జనసేన రథయాత్రకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాలను పరిరక్షించాలంటూ బీజేపీ- జనసేన నేతలు కలిసి రథయాత్రకు పూనుకున్న విషయం విదితమే. ఫిబ్రవరి-04న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని నేతలు భావించారు. అయితే సడన్‌గా రథయాత్రకు బ్రేక్ పడింది. రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. పంచాయితీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. స్థానిక ఎన్నికల అనంతరం ఈ రథయాత్రకు సంబంధించి తేదీలను నేతలు ఖరారు చేయనున్నారు.