నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో భవన కార్మికులకు అల్పాహారం

గుంటూరు: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు 12వ డివిజన్ లోని పట్నం బజార్ నందు గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో భవన కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 400 మంది భవన కార్మికులకు అల్పాహారం అందించడం జరిగింది. భవన కార్మికుల నుండి జనసేనకి మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని 2024కి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం కాయం అని, ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసికెత్తిపోయారని ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా గాని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ప్రతి ఓటరు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. 12వ వార్డు అధ్యక్షులు కొణిదె దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 12వ వార్డులో భవన కార్మికుల కోసం గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ గారు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి భవన కార్మికులు అనుక్షణం ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని భవన కార్మికుల కోసం అనుక్షణం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పార్టీ నాయకులు వార్డు నాయకులు హరి, రవి, అనిల్, మని, మలెల్ల శివ, పండు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.