జనసేన ప్రజా చైతన్య యాత్ర 23వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలంలో పణుకవలస, సోముదవలస గ్రామాల జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి గిరడా అప్పలస్వామి జనసేన పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 23వ రోజు గ్రామాల్లో ఇంటింటా పర్యటించి, గ్రామ ప్రజల నుండి సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో బొబ్బిలి నియోజకవర్గం మరియు తెర్లాం మండలం జనసైనికులు పాల్గొన్నారు.