ప్రజా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత లేని బడ్జెట్: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, నగరపాలక సంస్థ ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వేల కోట్ల రూపాయల బడ్జెట్ కానీ ఎక్కడ బడ్జెట్ కు, ప్రజా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశంలో చర్చించడానికి ప్రతిపక్ష కార్పొరేటర్లు గాని మాట్లాడకుండా పాలకమండలికి భజన బృందంగా మారారని అన్నారు. బడ్జెట్ పై మాట్లాడడానికి ఎమ్మెల్సీ షేక్ సాబ్జికి అవకాశం ఇవ్వకుండా ఆయనను అగౌరవపరిచారని విమర్శించారు. అవగాహన కలిగిన ఎమ్మెల్సీకి కూడా బడ్జెట్ పై మాట్లాడడానికి, అవగాహన లేని కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు ఆయనను అనుమతించకపోవడం దారుణం అన్నారు. 7 వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆరోగ్యానికి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనివ్వక పోవడంతో రోడ్లపై చెత్త పేరుకుపోయి, డ్రైనేజీలలో మురుగు పేరుకుపోయి ఈగలు, దోమలు నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. నగరంలో పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి సరఫరాకు వందలు వెచ్చించారని, ఎక్కడ ప్రజలకు మౌళిక సదుపాయాలు సక్రమంగా అమలు జరిగిన జాడలేదన్నారు. పరిపాలన చేతకాని వారు నగరపాలక సంస్థలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నారని, వారందరూ పాలకవర్గ సమావేశానికి భజన పాటలుగా మారారని అన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల కష్టాలు పరిష్కరించడంలో వారు విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నగర పాలకులు, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ప్రజలకు జవాబు దారిగా ఉండి, ప్రజా సమస్యల పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా పాలకమండలి సమావేశంలో చర్చకు అనుమతించకుండా అవమానించిన షేక్ సాబ్జీకి క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.