తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ సమస్యల వలయంగా మారింది

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ సమస్యల వలయంగా మారిందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 21,22,23,24 వార్డులలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో మురికి కూపంగామారిందన్నారు. సరైన పరిపాలన అందించకుండా కేవలం మున్సిపాలిటీని తమ అవినీతి సంపాదనకు కేంద్రంగా మార్చుకున్న కొట్టు సత్యనారాయణ ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలనికోరారు. 2014 నుండి 19 వరకు వందల కోట్లతో మునిసిపాలిటీని అభివృద్ధి చేశామని తుది దశకు చేరిన పనులు సైతం నిర్వీర్యం చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిన ఘనత స్థానిక శాసనసభ్యులు కే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వలవల బాబ్జి, భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు ఉన్నారు.