దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బర్మా ఫణిబాబు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను రైతులతో కలిసి పరిశీలించిన నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యులు బర్మా ఫణి బాబు. నియోజకవర్గంలోని ముసునూరు మండల అక్కిరెడ్డి గూడెం, చెక్కపల్లి గ్రామాల్లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, అరటి పంటలను పరిశీలించిన బర్మా ఫణి బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు రూ. 30 వేలు నుండి రూ.50 వేల వరకు నష్టపరిహారం అందించాలని, పంటల భీమా సౌకర్యం కల్పించి, ఈ-క్రాప్ నమోదు చేసి పంటలు నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ అందించడంతో పాటు తడిచిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ రైతులను ఆదుకునే దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నిరంతరం పని చేస్తామని, వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపి పార్టీలు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకునే దిశగా పాలన ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాశం నాగబాబు, కడియం సత్యనారాయణ, వేట త్రినాథ్, బర్మా సాయి, మట్ట స్వామి, చిట్టిబాబు, నక్క సత్య, కడియం శ్రీను, బర్మా రాంబాబు, సుధాకర్, బొప్పుడి నారాయణ, బజారు నందీశ్వర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.