బస్సు ప్రమాద సంఘటన చాలా బాధాకరం: జనసేన పార్టీ

అవనిగడ్డ: కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం మేకా వారి పాలెం వద్ద ఆదివారం అదుపుతప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. ఈ ఘటనపై స్పందించిన జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు చల్లపల్లి మండలం, నడకుదురు రోడ్డులో, మేకవరపాలెం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట బోడులో తిరగపడటం ఈ ప్రమాదంలో ప్రయాణికులకు దెబ్బలు తగలటం చాలా బాధాకరం. నిజంగా ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండటం ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటం చాలా అదృష్టంగా భావించవచ్చు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో 30 మీటరులు రోడ్డు క్రుంగి పోవటం వలన, డ్రైవర్ చెప్పే మాటలు ప్రకారం బస్సు గుంటలో పడటం, బ్రేక్ వేచినప్పటి స్టిరింగ్ కట్ అవ్వక బస్సు బోడిలో తిరగ పడింది అని, అయన మాటలు ప్రకారం రోడ్డు పరిస్థితి బాగోక పోవటం. ఈరోడ్డు ఈమధ్య వెయ్యటం జరిగింది. కొద్దికాలనికే క్రుంగి పోవటం బాధాకరం. అదే విధంగా అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్ళే కరకట్ట బస్సులు ఎక్కువుగా ప్రమాదాలకు గురివుతున్నాయి. బస్సులు మెంటినెస్ సరిగా లేవు అనీ, డిపోలో సరిపడా ఉద్యోగులు ఉన్నప్పటికీ బస్సులకు మెటీరియల్ ప్రభుత్వం అందించలేకపోతున్నారు అనీ చాలా మంది అనుకుంటున్నారు. ఈ రోజు జరిగిన ప్రమాదానికి గురిఅయిన బస్సు కట్టలు కుడా విరిగిపోయినాయి అంటే రోడ్డులు పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆర్టీసీ లో బస్సులు నడిపే డ్రైవర్స్ కుడా ఈ రోడ్ల పరిస్థితి చూసి భయపడుతున్నారు అనీ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుద్దో అని ప్రాణలు అరిచేతిలో పెట్టుకొని బస్సులు నడుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు బాగుచేయించాలి అని, అదే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులు మెయింటినేన్స్ సరిగా చూడాలి అని, బస్సులకు కావలిసినవి పరికరాలు వెంటనే తెప్పించాలి అని జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. దెబ్బలు తగిలిన ప్రయాణికులు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.