ఇండియాకు భారీ సాయం ప్రకటించిన కెనడా

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కి చేరింది. ఈ నేపథ్యంలో ఇండియాకు అండగా నిలుస్తామని ఇప్పటికే చాలా దేశాలు మద్దతు ప్రకటించాయి. అందులో భాగంగానే వైద్య సామగ్రి, ఆక్సిజన్ ను ఇండియాకు అందిస్తూ తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం కూడా 10 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా ప్రకటించింది. మానవతా దృక్పథంతో 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను కెనడియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నట్లు కెనడా అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ది శాఖ మంత్రి కరీనా పేర్కొన్నారు.