కరోనా కలకలం: కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్ ముమ్మర వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సేకరణకు ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తక్షణమే కొనుగోలు చేసి వీలైనంత త్వరలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు తరలించాలని ప్రధాని మోదీ సూచించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో పేర్కొంది.

పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఇటీవల మంజూరు చేసిన 713 పీఎస్ఏ ప్లాంట్లకు అదనంగా మరో 500 నూతన ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేసినట్టు పీఎంఓ తెలిపింది. మరోవైపు ఆక్సిజన్ సమీకరించేందుకు ఐఏఎఫ్‌, డీఆర్డీఓలు తమ వంతు ప్రయత్నాలు చేపట్టాయి. ఆక్సిజన్ డిమాండ్ ను అధిగమించేందుకు దుబాయ్, సింగపూర్ ల నుంచి ఐఎఎఫ్ సింగపూర్, దుబాయ్ ల నుంచి తొమ్మిది క్రయోజనికక్ కంటెయినర్లను భారత్ కు తీసుకువచ్చింది.