జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తనతో కెనడా జనసేన జూమ్ సమావేశం

కెనడా జనసేన టీం వారంతంలో నిర్వహించే “నో యువర్ లీడర్” కార్యక్రమంలో భాగంగా ఈ వారం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తనతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కీర్తన పరిచయంతో మొదలయిన ఈ కార్యక్రమంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని, పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలను ప్రజలలోకి బలంగా ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది. చివరిగా కెనడా జనసైనికులు అడిగిన ప్రశ్నలకు కీర్తన సమాధానాలు చెప్పడం జరిగింది. మొదటగా కీర్తన పార్టీ కోసం చేస్తున్న కృషిని, మీడియాలో తన గళం విప్పుతూ ప్రత్యర్ధులను ఎదుర్కొంటున్న తీరును అభినందిస్తూ కెనడా జనసేన టీం ధన్యవాదములు తెలిపారు. కీర్తన కూడా విదేశాలలో ఉన్నా కూడా కెనడా జనసేన టీం పార్టీ అభివృద్ధికి చేస్తున్న కంట్రిబ్యూషన్ ని మెచ్చుకోవడం జరిగింది. చివరిగా సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు, జనసేన గెలుపు అవకాశాలు గురించి కీర్తనని అడిగి తెలుసుకుని కెనడా జనసేన టీం నుండి తమవంతు సపోర్ట్ ఎల్లప్పుడూ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటామని తెలియజేసారు.