విజయకుమార్ సుందరపుతో “కెనడా జనసేన” జూమ్ సమావేశం

కెనడా, జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఎలమంచిలి నియోజకవర్గం ఇంచార్జ్ సుందరపు విజయకుమార్ విశిష్ట అతిథిగా కెనడా జనసేన టీం ఆహ్వానించి జూమ్ సమావేశం నిర్వహించింది. కెనడా జనసేన టీం గత కొన్ని నెలలుగా విజయవంతంగా “నో యువర్ లీడర్ ప్రోగ్రామ్” చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన టీం వాస్తవానికి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రపంచంలో ఏర్పడిన ఒక పెద్ద ఫ్యామిలీ లో ముఖ్యమైనది అన్నారు. నా కెనడా జనసేన కుటుంబ సభ్యులందరినీ కలడం ఒక గొప్ప అవకాశం అని అన్నారు. నాగబాబు కూడా మీ అందరితో కలిసి కెనడా టీంని ప్రశంశించడం, అలాగే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ కి మరియు జనసేన పార్టీకి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అండగా ఉండడం సోషల్ మీడియా హెడ్ హరిప్రసాద్ గారు ఇచ్చిన పార్టీ నోట్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, 2008లోనే అంటే పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుండే మేము చిరంజీవి అభిమానులుగా ఉంటూ చిరంజీవిని పార్టీ పెట్టండని, మీరు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న టీంలో ఉన్నానని తెలిపారు. యువరాజ్యం విభాగంలో పవన్ కళ్యాణ్ తో పాటు ట్రావెల్ చేశానన్నారు. ప్రజారాజ్యం విలీనం తర్వాత, కొంత తటస్తంగా ఉన్నానని, చంద్రబాబునాయుడు పిలుపు మేరకు 2012లో ఎలమంచిలి నా సొంత నియోజకవర్గం నుంచి పనిచేశానని చెప్పారు. 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత, ఆయన అనుమతితో 2018లో జనసేనలో చేరానని చెప్పారు. 2019 ఎలక్షన్ లో రమారమి 20వేల ఓట్లు అప్పటి పరిస్థితులలో సాదించానన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రజలుకున్న నమ్మకం గొప్పగా పెరిగిందని ఈరోజు ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు అని, గాజు గ్లాస్ అనేది బ్యాలెట్ పేపర్ మీద కనిపిస్తే మనం ఊహించని భారీ రిజల్ట్స్ వస్తాయని అన్నారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ యాత్రలో వైయస్సార్సీపి అరాచకాలను, పోలీసు వారు వ్యవహరించిన తీరును మాతో పంచుకున్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ఏ విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారొ వివరించారు. నాయకుడు అన్నాక రాజకీయ చట్రంలో, ఈరోజు మన దగ్గర అధికారం ఉందని ఒకలాగా అధికారం లేదని ఇంకోలాగా ప్రవర్తిస్తే ఎవ్వరు కూడా రాజకీయాలలో నిలబడలేరు అని తెలిపారు. ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్ లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నాకేవలం ఒక్కడే పార్టీ జనసేన పార్టీ జెండా పట్టుకుని విశాఖపట్నంలో అన్ని సమస్యల్ని ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకుంటున్నాడు అని తెలిపారు. అన్ని సమస్యల మీద జనసేన పార్టీ మార్క్ ఉందని తెలిపారు. అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఎంతమంది వచ్చినా, ప్రతి ఒక్కరు కూడా రియల్ లీడర్షిప్, రియల్ రిప్రెసెంటేషన్ అనేది మా పార్టీ నుంచి ఉంటుంది తెలిపారు. మీ కెనడా జనసేన టీం ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా కాలర్ ఎగరేసుకొని గర్వంగా ఉండేటట్టు ఉంది అని ప్రశంసించారు. మీరు అందరూ చేసే సూచనలు, సలహాలు తీసుకుంటూ మీ యొక్క అలోచనలను మేము ఆచరిస్తానని చెప్పారు. 500 మంది సభ్యులు పైగా ఉన్న కెనడా జనసేన టీం, తమ వంతు సహకారాన్ని అందిస్తుందని, విజయకుమార్ గారితో మాట్లాడటం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని కెనడా జనసైనికులు తెలిపారు. ఈ మీటింగ్ కు బాల విశ్వనాథ్ గుద్ధేటి మోడరేటర్ గా కెనడా జనసేన టీం నుంచి వ్యవహరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.