రామునిపాలెం గ్రామంలో ఇంటింటికి జనసేన మేనిఫెస్టో

*పవనన్న ప్రజాబాట 86వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం గోవిందపురం పంచాయతీ రామునిపాలేం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మరియు అడుగుజాడల్లో నడుస్తున్న నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మంగళవారం ఉదయం రాముని పాలెం గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్ళి యువతికి మహిళలకు జనసేన పార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొన్న రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు లావేరు మండలం స్ధానిక గోవిందపురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు యంపిటిసి అభ్యర్థి అదపాక అప్పలరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈపవనన్న ప్రజాబాట ప్రారంబించి 86వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో వివరిస్తూ విజయవంతంగా ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామం ప్రజలతో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా 3000 మందికి చనిపోయిన కౌలు రైతులకు కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జనసేన పార్టీ గెలిస్తే మహిళలుకు 5గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వబడును. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ బదులు 2500/-నుండి3500/-వరకు నగదును ఎకౌంటులో జమచేయబడును. ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు ఇవ్వబడును. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో రామునిపాలెం గ్రామ పెద్దలు, మహిళలు మరియు జనసైనుకులు రమేష్, రామునాయుడు, తిరుపతి నరేష్, బుచ్చిబాబు, పోతినాయుడు రమణ, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.