పరీక్షలు పూర్తి అయ్యే వరకూ విద్యుత్ కోతలను రద్దు చేయండి: జనసేన డిమాండ్

పార్వతీపురంజిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండల బొడ్లపాడు గ్రామంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతూ.. పరీక్షల కొరకు విద్యార్థులు కొవ్వొత్తుల వెలుగు పై ఆధారపడి చదవవలసిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులంతా ఎప్పటికప్పుడు కరెంట్ పోతుందని ఆవేదన చెందుతున్నారు. పరీక్ష సమయంలో కూడా కరెంట్ లు లేకపోతే విద్యార్థులు ఏ విధంగా చదవగలరు.. ఎలా పాస్ అవ్వగలరు..? విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని.. పది, ఇంటర్ పరీక్షలు అయ్యేంత వరకూ కరెంటు కొత అనేది ఉండకూడదని విద్యార్థులు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కరెంటు కొరత లేకుండా విద్యార్థులు పరీక్షలకు కరెంటు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ రవికుమార్ (జానీ) తెలియజేసారు.