నిమ్మగడ్డ రమేష్ పై కేసునమోదు ..

ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంటి అద్దె అలవెన్సు తీసుకుని హైదరాబాద్‌లో ఉంటూ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ  బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ న్యాయవాది.. వెంటనే నిమ్మగడ్డపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీనివాసరావు కోరాడు. ఇక మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన రగడ జరుగుతూనే ఉన్నది. కరోనా లాక్ డౌన్ తరువాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలతో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే, ప్రభుత్వం మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. కరోనా ఉదృతి ఇంకా కొనసాగుతోందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రభుత్వం అంటోంది. ఎస్ఈసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసును ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి కమిషనర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని కి లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ లేఖపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎలా స్పందిస్తారో చూడాలి.