సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..!

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేసు నమోదు చేశారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పోసాని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోసాని తెలంగాణ నుంచి బహిష్కరించాలని, ఆయన వ్యాఖ్యలు చాలా దూరంగా ఉన్నాయనీ… పోసాని తన ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలని జనసేన వీర మహిళలు, జనసైనికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీర మహిళ రత్న పిల్ల, చర్లపల్లి డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్, ఏ ఎస్ రావు నగర్ డివిజన్ జనరల్ సెక్రెటరి కుమార్, డాక్టర్ స్వామి నాయుడు శేషు, నరేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.