స్పందనలో లమ్మసింగి ప్రజల వినతి పత్రం.. డా. గంగులయ్య హామీ

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు: చింతపల్లి మండలం లమ్మసింగి గ్రామంలో ప్రజలు తమ గ్రామములో ఇళ్ల మధ్యన ఎన్.హెచ్516 జాతీయ రహదారి వెళ్తుందని అందుకు తగిన సర్వే నిర్వహించారని ఈ జాతీయ రహదారిని గ్రామ ప్రజల నివాస సముదాయాలపైన కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని వాటి విషయమై అధికారులు ఆలోచన చేసి మాకు సహాయం చెయ్యాలని శనివారం స్పందన కార్యక్రమంలో మా గోడు వినిపించమని లమ్మసింగి గ్రామ ప్రజలు తెలిపారు. అనంతరం పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా..వంపురు గంగులయ్యను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ విషయమై స్పందించిన డా. గంగులయ్య గతంలో ఈ నేషనల్ హైవే 516 కారణంగా కులపాడు గ్రామంలో కూడా ఇదే సమస్య ఎదురైతే హైవే ఆదారిటీ అధికారులతో కలెక్టర్ గారి చేత ఆ గ్రామ పర్యటన చేసి సమస్య తీర్చేలా ప్రయత్నాలు చేసేలా మాట్లాడమని.. త్వరలో మీ ఊరు సందర్శించి తగిన సమాచార సేకరణ చేసి అధికారులకు మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా..గంగులయ్యతో పాటు చింతపల్లి మండల నాయకులు వాడకాని వినయ్, వాలంగి పునీత్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, మసాడి సింహాచలం, లంబసింగి గ్రామస్తులు మరగడి గోపాల్, శ్రీనివాస్, హేమ మాలిని, జయ తదితరులు హాజరయ్యారు.