ఘనంగా మలిశెట్టి వెంకటరమణ జన్మదిన వేడుకలు

  • ఉప్పరపల్లెలో రాజంపేట జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ జన్మదిన వేడుకలు
  • కేక్ కట్ చేసిన జనసేన నాయకులు

రాజంపేట మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో శుక్రవారం ఉదయం రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జనసైనికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. మలిశెట్టి వెంకటరమణ ఇలాంటి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని.. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి మంచి పదవులను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన యువనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చంగల్ రాయుడు, సుబ్రహ్మణ్యం, కిషోర్ జనసేన వీరమహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.