గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించిన సిజి రాజశేఖర్

పత్తికొండ: గాంధీ జయంతి సందర్భంగా సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాల ద్వారా దేశాన్ని ఏకం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం కోసం ఎలాగైతే పోరాడి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టి స్వతంత్రం సిద్దింపచేసారో ప్రస్తుతం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అక్రమ అరెస్టును, అవినీతి పాలనను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేశారాన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, సింగం శ్రీధర్, జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ పురుషోత్తం, మండల నాయకులు, ఇస్మాయిల్, ఎర్రి స్వామి, అభిరామ్, రంగస్వామి, ఈరన్న, వెంకటేష్, మరియు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.