ప్రజా పోరాట యాత్రలో రామళ్లకోటలో పర్యటించిన సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల నాయకులు నాయికల్ బాబ్జి, ఆగిపోగు నాగ రాజ్ ఆధ్వర్యంలో రామళ్లకోట గ్రామంలో పర్యటించడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీజి రాజశేఖర్ మాట్లాడుతూ రామళ్లకోట గ్రామంలో సామాన్యులకు ఇళ్ళపట్టాలు ఇవ్వడం లేదని… ఉన్న వారికే జగన్ కాలనీలో ఇళ్ళపట్టాలు ఇస్తున్నారని, కనీసం స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామంటే కూడా గ్రామస్తులకు ఇల్లు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన ఆలోచన. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు నిరుపేదలో కనిపించడం లేదా అలాగే రామలకోట గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందర డ్రైనేజీ గుంతలు ఉండడంవల్ల గుంతలో పడి అనేకమంది పిల్లలు, అలాగే డ్రైవింగ్ చేసే ప్రయాణికులు గున్తలో పడి తీవ్రమైన అవస్థలు పడుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి నాయకులు సామాన్యులకు అండదండగా ఉండాల్సింది పోయి ఉన్న వారికే అన్ని అందిస్తున్నారు. జగనన్న పోవాలి పవన్ అన్న రావాలి అని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో దిగపోవడం సత్యమని, రాబోయేది జనసేన ప్రభుమని జనసేన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే ప్రతి సామాన్యునికి పనిచేసే బాధ్యత మేము చూసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు బి పులి శేఖర్, గద్దల రాజు, సుధీర్, మధుసూదన్, నాగేశ్వరరావు, తిరుపాల్, మాలిక్ భాషా, ఎం కాశి, కళ్యాణ్ మద్ది కిరణ్ హరి బంగారు బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.