అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి జనసేన ఆర్ధికసాయం

నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో కందుకూరి శివ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని నియోజకవర్గ నాయకులు మండల కమిటీ నాయకులతో ఆయనను ఆయన కుటుంబాన్ని పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, మండల ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి పాపారావు, మండల సంయుక్త కార్యదర్శి చల్లపల్లి శేఖర్, నవీన్, అఖిల్, సతీష్, రాజమౌళి పాల్గొన్నారు.