74వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం

  • 33వ వార్డులో డాక్టర్ కందుల పర్యటన
  • సాదర స్వాగతం పలికిన ప్రజలు
  • పుష్పవతి అయిన అమ్మాయికి పట్టుబట్టులు, వెండి పట్టీలు అందజేత

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 74వ రోజుకు చేరుకుంది. సోమవారం నియోజకవర్గంలోని 33వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. అనంతరం 33 వ వార్డు, అమ్మవారివీధిలో పుష్పవతి అయిన అమ్మాయి జాహ్నవికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో ప్రజల పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకోవడం జరిగిందన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో పర్యటించి నేరుగా ప్రజలను కలుసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలలో అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రభుత్వ మార్పు ప్రజలు కోరుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని డాక్టర్ కందుల చెప్పారు. ప్రజల మంచి కోసం ఏం చేయడానికి అయినా సరే తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారాయణ రెడ్డి, మని, రాజేశ్వరి, జాన్సీ, దుర్గ, కుమారి, జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.