శ్యామ్ కుమార్ కు మద్దతుగా సిజి రాజశేఖర్ ఇంటింటి ప్రచారం

పత్తికొండ నియోజకవర్గం: ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్ కుమార్ గారిని గెలిపించాలని, కే ఈ శ్యామ్ కుమార్ తో కలిసి జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త సిజి రాజశేఖర్ ఆదివారం మద్దికేర మండలంలో, మద్దికేర టౌన్ నందు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మరో 15 రోజులు కష్టపడి పని చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధితో పాటు స్థానికంగా మద్దికేర టౌన్ లో ఉన్న ప్రధాన సమస్యలు ప్రతి ఒకటి నెరవేరుస్తామని మద్దికేర మండలంతో పాటు పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరాలంటే స్థానికంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఉమ్మడి అభ్యర్థి గెలవాలి రాష్ట్రంలో కూటమి గెలిస్తేనే మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మద్దికేర జనసేన పార్టీ నాయకులు, సోంపల్లి అశోక్ కుమార్, గద్దల అజయ్, నరేష్, కంబగిరి చిరంజీవి, తిమ్మప్ప మరియు అనేకమంది కలిసి ఈ కార్యక్రమాన్ని జయవంతం చేసి ప్రతిఒక్క జనసైనికుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.