కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో సోమవారం స్కాముపై చైతన్యం కార్యక్రమం జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ ఆధ్వర్యంలో జగన్నాధపురం వంతెన వద్ద, 5వ డివిజన్లో వినాయక కేఫ్ వైయస్సార్ వంతెన వద్ద జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ మరియు సిటీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి భాస్కర్ అధ్వర్యంలోను, వెంకట్నగర్ లో తోట కుమార్ ఆధ్వర్యంలోను జరిగింది. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రోజుకొకటి బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ఒకపక్క చూస్తుంటే వారానికో అప్పు ఇంకో పక్క చూస్తుంటే నెలకో స్కీము అని ఈ వై.సి.పి గొప్పలు చెపుతోందనీ కానీ నిజాలు బయటకి తవ్వి తీస్తుంటే అడుగుకో స్కాము బయటపడుతోందన్నారు. దీనిని బట్టి పరిపాలన కుంటుబడి రొజు రోజుకీ ఎందుకు ఈ రాష్ట్రం దివాలా దిశగా వెళ్ళుతోందో ప్రజలకు కూడా అర్ధమయ్యిందనీ బహుశా భారతదేశ చరిత్రలో నేటి ఆంధ్రరాష్ట్ర పతనం ఒక చెరగని మచ్చలా మిగిలే పరిస్థితి తీసుకువచ్చిన ఈ వై.సి.పి ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలించే నైతిక అర్హత లేదని ఎద్దేవా చేసారు. వై.సి.పి అవినీతిని, అక్రమాలను అన్నీ కప్పిపుచ్చడానికి ఈ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనల తాయిలాలతో అసత్య ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి మేడిపండులా ఉందనీ వీరి పాలన వల్ల మొత్తం వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితికి వచ్చేసాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సిటీ కార్యదర్శి ముత్యాలదుర్గాప్రసాద్, వాడ్రేవు లోవరాజువర్మ, సిటీ కార్యదర్శి కంట రవికుమార్, మధు, అగ్రహారపు సతీష్, గంటిమి దుర్గ, రామిరెడ్డి నగేష్, దారపు శిరీష, బట్టు లీల, చొడిపల్లి సత్యవతి, వరిపల్లి ప్రసాద్, గంపల ప్రసాద్, బశ్వాని నాగబాబు, పినపోతు గంగాధర్, ముల్లేటీ లొక భగవాన్, రంగ శ్రీనివాస్, అగ్రహరప్పు సతీష్, తోట కృష్ణ తేజ, అరిగెల శివాజీ, తుమ్మలపల్లి సీతారాం, గుర్రాల త్రిమూర్తులు, కారపు క్రంత్ కుమార్, దేవు మహేష్, నగులపల్లి వరప్రసాద్, పాకలపాటి భాస్కర్, ముమ్మిడి పండు, అడపా కుమార్, దాసరి దుర్గప్రసాద్, గుబ్బల రవి కుమార్, కోపల్లి ప్రసన్నకుమార్, గంటిమి దుర్గా ప్రసాద్, చొడపునేది రామ సతీష్ తదితరులు పాల్గొన్నారు.