కాలువలు మరమ్మతులు చేయకుండా నీళ్లు విడుదల చేయడం ఏమిటి?: ఎస్.వి బాబు

పెడన నియోజకవర్గం: కాలువలు మరమ్మతులు చేయకుండా నీళ్లు విడుదల చేయడం ఏమిటని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి బాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని డెల్టా ప్రాంతాన్ని గతంలో అన్నపూర్ణగా అభివర్ణించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డెల్టా మనుగడ ప్రశ్నార్థకమైంది. డెల్టా రైతులది దిక్కుతోచని పరిస్థితికి చేరుకుంది. పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవేళ అమ్మిన సకాలంలో డబ్బులు రాని పరిస్థితి. దాన్యం కొనుగోలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని సాక్షాత్తు వైసిపి ఎంపీలు బహిరంగంగా మాట్లాడడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు, రైతు దగాకోరు కేంద్రాలుగా మారాయి. కృష్ణా డెల్టా కి రబీ సీజన్లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ చెప్పిన మాటలు, ఈ ఒక్కసారి రైతులు ఒక పంట త్యాగం చేస్తే, కాలువల మరమ్మతులు చేసుకోవచ్చు తద్వారా రాబోయే ఖరీఫ్ సీజన్లో నీటి ఎద్దడి ఉండదు అని చెప్పడం జరిగింది. నేనిప్పుడు జోగి రమేష్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, పంటకాలంలో గాని, మురుగు కాలువలో గాని ఒక తట్టెడు మట్టి అయినా మీ ప్రభుత్వం తీసిందా?. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా మట్టిని అమ్ముకోవడం తప్ప, కాలువల మరమ్మతులు మీకు పట్టవా?. కాలవ గట్లను సైతం తోవుకుని మట్టి అమ్ముకుంటున్న మీకు కాలవలు తవ్వడం తెలియదా?. మీరా రైతుని రారాజు చేసేది. రైతును రైతుల బతకనివ్వండి చాలు. వైసీపీ ప్రభుత్వం లో ఒక్క రైతుకైనా మద్దతు ధర లభించిందా?. జనవరి, ఫిబ్రవరిలో అమ్మిన ధాన్యానికి ఇప్పటికీ బిల్లులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ దాల్వా పంట ఇవ్వకుండా రైతులను మబ్బిపెట్టి ఇసుక అక్రమ దారులను ప్రోత్సహించారు. కేవలం ఇసుకను అక్రమంగా అమ్ముకోవడానికి మాత్రమే దాల్వాపంట ఇవ్వలేదు అనేది బహిరంగ రహస్యం. జూన్ నెలలో నీళ్లు విడుదల చేశామని సంకలు గుద్దుకోవటం కాదు. ఇప్పటివరకు దాన్యం డబ్బులు రాని రైతులకు డబ్బులను చెల్లించే విధంగా చూడండి. వ్యవసాయానికి పూర్వవైభవం రావాలన్నా, రైతు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించాలన్నా అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే సాధ్యం. 30 కోట్ల రూపాయల తన కష్టార్జితాన్ని రైతులకు ఆర్థిక సాయం చేసిన రైతుల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారని ఎస్.వి బాబు తెలిపారు.