వెల్లటూరులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

వేమూరు నియోజకవర్గం: వెల్లటూరు గ్రామంలో జరుగుతున్న ఐలమ్మ జయంతి కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు మురాల వాసుదేవ్ గౌడ్ ఆహ్వానం మేరకు చాకలి ఐలమ్మ 128వ జయంతి కార్యక్రమంలో సోమరౌతు బ్రహ్మం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంఘం యువజన ఉపాధ్యక్షుడు గుర్రం ద్వారక శ్రీను, రాష్ట్ర యువాజన ప్రధానకార్యదర్శి కొల్లూరు హనుమంతరావు, ఎం.ఆర్.పీ.ఎస్ నాయకులు యల్లమాటి తదితర వేమూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు, బీసీ నాయకులు తదితర బీసీ నాయకులు పాల్గోన్నారు.