గుమ్మలూరు జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

ఆచంట నియోజకవర్గం, పోడూరు మండలం గుమ్మలూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాత కొప్పినిడి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ను మొదటగా గ్రామ జనసేనపార్టీ అధ్యక్షులు కడలి రాంబాబు మరియు మండల అధ్యక్షులు గుడాల రాజేష్ చే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ రావిహరీష్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో గత సంవత్సరం జనసైనికులు సహకారంతో మూడు నెల్లు పాటు చలివేంద్రం నిర్వహించడం జరిగిందని. ఈ సంవత్సరం కూడా జనసైనికుల సహకారంతో వేసవి కాలం ముగిసేవరకు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, పెనుగుండ మండల అధ్యక్షులు కంబాల బాబులు, ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ శ్రీనివాస్, పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ కార్తీక్, జనసేన నాయుకులు షేక్ మహ్మద్ అలీ, జనసేనపార్టీ వార్డు మెబర్ శ్రీమతి దార్లంక ధనలక్ష్మి, కడలి శ్రీనివాస్, మద్దింశెట్టి హరికృష్ణ, మళ్ళొజు పవన్ , తోము రమేష్, పిల్లా వంశీ, అరేడి హరికృష్ణ, నక్కా మధుబాబు, కొప్పినిడి పవన్, మద్దింశెట్టి నాగు, సిహెచ్ భాను, కొప్పినిడి పవన్, బండారు వినయ్, తోట అంజి, కొర్రా రాంబాబు, దార్లంక సిద్దు, తూము బాలాజీ, దూడే విజయ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.