ఎచ్చెర్ల మండలంలో ధర్మవరం, భగీరథపురం, కొంగరం గ్రామాల్లో పర్యటన

ఎచ్చెర్ల, ధర్మవరం, ఆదివారం చేపట్టబోయే జెండా ఆవిష్కరణ మరియు బహిరంగసభ కోసం దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ఉన్న జనసైనికుల ఇళ్లను సందర్శించారు.
భగీరథపురం గ్రామాల్లో ఉన్న వృద్ధులను, గ్రామస్తులను కలిసి జనసేన యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన ఎందుకు అవసరమో తెలియజేశారు. అలాగే ఆదివారం జెండా ఆవిష్కరణ కోసం స్థానిక యువతకు దిశానిర్దేశం చేశారు.
కొంగరం స్థానిక మహిళా రైతు కూలీలను కలిశారు. వారు పడుతున్న కష్టాలు ఈ ప్రభుత్వంలో రైతులకు చేస్తున్న అన్యాయాలను తెలియజేశారు. పవన్ కళ్యాణ్ 3000 మంది కౌలు రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారో వివరించి జనసేనకు రాబోయే ఎలక్షన్ లో మీరందరూ మద్దతుగా ఉండాలని కోరడం జరిగింది. అలాగే కొంగరం గ్రామపంచాయతీ రంగనాధపురం ఆ గ్రామం మొత్తం జనసేనకు మద్దతుగా ఉన్నారని తెలుసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అర్జున్ భూపతి మరియు ఎచ్చెర్ల మండల నాయకులు తమ్మినేని శ్రీనివాస్, దన్నాన సంతోష్ హేమ సుందర్ మరియు ఆయా గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.