జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

బెళుగుప్ప మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బెళుగుప్ప డిప్యూటీ తహసీల్దార్ పీరా చలివేంద్రమును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం బెళుగుప్ప మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్ మాట్లాడుతూ.. ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని గుర్తుంచుకుని ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలను ప్రజలకు అందించడం జనసేన లక్ష్యం అని చెప్పారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బండ మీద నాని, తిప్పయ్య, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-05-02-at-5.14.20-PM-1-1024x768.jpeg