చంద్రగిరి నియోజకవర్గ జనసేన విస్తృతస్థాయి ఆత్మీయ సమావేశం

  • హలో చంద్రగిరి! బై బై చెవిరెడ్డి!!: జనసేన చంద్రగిరి ఇంఛార్జి దేవర మనోహర
  • అంగరంగవైభవంగా చంద్రగిరి నియోజకవర్గ జనసేన విస్తృతస్థాయి ఆత్మీయ సమావేశం, పాల్గొన్న రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులు

చంద్రగిరి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి దేవర మనోహర నిర్వహించిన నియోజకవర్గ ముఖ్యనేతల విస్తృతస్థాయి సమావేశం సోమవారం స్థానిక చంద్రగిరి నియోజకవర్గంలోని వై.ఎస్.ఎం.ఆర్ ఫంక్షన్ హాలులో జరిగింది. రానున్న 100 రోజుల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ప్రజలకు గడప గడపలో జనసేన షణ్ముఖవ్యూహం ఎలా తెలియచేయాలి, టిడిపితో సమన్వయము తదితర పార్టీ అంతర్గత విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిపై చర్చించడం జరిగింది. శ్రీ దేవర మనోహర మాట్లాడుతూ తనకి అధిష్టానం ఇంఛార్జి ప్రకటించిన తరువాత, పార్టీ అధిష్టానాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపి వారి సూచనలు మేరకు, జిల్లా అధ్యక్షులు వారి సలహాలు తీసుకుని చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీని మరింత ప్రజలకు చేరవేసే క్రమంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబ పాలనలో ప్రజలు విసిగిపోయారని, రెండు పార్టీల కలయిక కొండంత బలాన్ని ఇచ్చిందని 2024లో చెవిరెడ్డికి రాజకీయ సన్యాసం చేయిస్తామని, 5సం ఒక లెక్క.. పోలింగ్ రోజు మరో లెక్క .. ఆ రోజు చాలా ముఖ్యం అని.. మండల అధ్యక్షులు మరింత అప్రమత్తంగా ఉంటూ దొంగ ఓట్లపై ధ్వజమెత్తి ప్రజలకు సుపరిపాలన ఒక్క పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని తెలియచేయాలి అన్నారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాలని, ఉమ్మడి అజెండాతోనే ముందుకు వెళ్ళాలని సూచించారు. ఏ పార్టీ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్లు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. పార్టీ మేనిఫెస్టో లోని షణ్ముగ వ్యూహాన్ని బలంగా తీసుకెళ్లాలి, రేపటి నుంచి ఉమ్మడి అభ్యర్థి అది జనసేన అయినా, టిడిపి అయినా వారి గెలుపుకు కృషి చేయాలన్నారు. అలాగే చెవిరెడ్డి అభివృద్ధి నెపంతో అవినీతికి పాల్పడుతున్న విషయం ప్రజలకు చేర్చి చెవిరెడ్డిని ఓడించాలి అని హాలో చంద్రగిరి.. బైబై చెవిరెడ్డి..! చంద్రగిరి అభివృద్ధికి తోడ్పడతామని తెలిజేసారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి మాట్లాడుతూ ఇక్యమత్యమే అన్నిటికీ మూలం అని, చెవిరెడ్డి పాపాలకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని దానికి అందరి సమిష్టి కృషి తప్పనసరి అని ఎద్దేవా చేశారు. జిల్లా కార్యదర్శి నాశీర్ మాట్లాడుతూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వారంతా ముందుంటారాని, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని అందరి ఉమ్మడి లక్ష్యం వైసీపీ విముక్త చంద్రగిరి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి కంచి శ్యామల, జిల్లా కార్యదర్శి శ్రీ నాశీర్, మండల అధ్యక్షులు సంజీవి హరి, యువ కిషోర్, దూది జస్వంత్, వెంకట్ రాయల్, గురునాథ్ తలారి, మురళి మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు, పాల్గొన్న ప్రతి జనసైనికునికి పేరు పేరునా మా యొక్క ప్రత్యేక ధ్యవాదాలు.