చిల్లపల్లికి చిరు సత్కారం

పిఠాపురం: వారాహి విజయ యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి సమన్వయకర్తగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని నియమించగా వారికి అప్పచెప్పిన బాధ్యతలను దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా ఆదివారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావుకి చిరు సత్కారం నిర్వహించడం జరిగింది.