స్పందనలో చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు, వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అనేక రకాల సమస్యలతో జిల్లా కార్యాలయంలో అధ్యక్షుల వారిని ప్రజలు పలుమార్లు సంప్రదించిన విషయాలపై సోమవారం కలెక్టర్ కి అర్జీ ఇవ్వడం జరిగింది దానిలోని ముఖ్యంశాలు…..

  1. రైతులు తొలివిడత తోలిన ధాన్యాలకు ఇంకా డబ్బు రాకపోవడం.
  2. సామాన్యుడికి భారంగా మారిన ఆర్టీసీ చార్జీల పెంపు
  3. అర్హులై గతంలో డబ్బు కట్టించుకున్న వారికి ఇంకా టిడ్కో గృహాలు కేటాయించకపోవడం
  4. పేద ముస్లింలకు వివాహ సందర్భంగా ఇస్తున్న దుల్హన్ పథకం అందకపోవడం.
    ఈ సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరపున కోరారు.
    అనంతరం జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మీడియా మిత్రులతో మాట్లాడుతూ… వైసీపీ అధికారంలోకి వచ్చిన గత మూడు సంవత్సరాల ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన జనవాణి కార్యక్రమం విజయవంతం కావడం దానికి నిదర్శనం అని సామాన్యుడు సమస్యలతో సతమతమవుతూ వెయిట్ చేసి మరీ అధ్యక్షులు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అర్జీలు సమర్పించడం జరిగిందని, ప్రజల సమస్యలు తీరాలంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధికారం లోకి రావాల్సిందేనని.ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ కార్యాలయానికి విరివిగా సమస్యల అర్జీలు వస్తున్నాయని వాటిలో ముఖ్యమైన వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చామని రానున్న రోజుల్లో సమస్య పరిష్కారమయ్యే వరకు కూడా ప్రజల తరఫున జనసేన పార్టీ పోరాడుతుందని తెలియజేశారు.
    ⚫ రైతుల మొదటి కాపుతో ధాన్యం డబ్బులు ఇప్పటికీ వారికి అందలేదు. ఆర్థిక స్థోమత లేక చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.
    ⚫ అర్హులుగా ప్రకటించిన పేదలకు అవి పూర్తయిన వారికి అందజేయలేదు. వారిలో కొంత మంది డబ్బు కట్టిన వారు కూడా ఉన్నారు.
    ⚫ గత మూడు సంవత్సరాలుగా పేద ముస్లింలకు వివాహ సందర్బంగా ప్రభుత్వం ఇవ్వవలసిన దుల్హన్ పథకం అందటం లేదు, వెనకబడిన మైనారిటీ తరగతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిగణించి వారికి పధకం అంద చేసేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం.
    ⚫ ముఖ్యంగా ఆర్టీసీ చార్జీలు గత మూడు సంవత్సరాల్లో దాదాపు 60 శాతం పెరిగి సామాన్యుడికి పెను భారంగా మారాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఒకే ఒక ప్రభుత్వ రంగ రవాణా సాధనం ఆర్టీసీ.చార్జీలు విరివిగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పై అంశాలు పలుమార్లు ప్రజలు జనసేన జిల్లా కార్యాలయంకు అర్జీల రూపంలో ఇచ్చిన కారణంగా,ప్రజా సమస్యలను జనసేన పార్టీ జిల్లా కార్యాలయం తరపున అర్జీ ఇవ్వటం జరిగింది. కలెక్టరు పరిశీలించి వాటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.