వీరవల్లిపాలెం గ్రామ పంచాయతీకి 8 ప్రతిభ అవార్డులు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంకు గ్రామ పంచాయతికి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా 8 ప్రతిభ అవార్డులు వచ్చాయని జనసేన నేత, సర్పంచ్ సలాది బుచ్చి రాజు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2023 వీరవల్లి పాలెం గ్రామపంచాయతీకి సర్పంచ్ సలాది బుచ్చి రాజు ఆధ్వర్యంలో 8అవార్డ్లుల్లో ఉత్తమ ప్రతిభ అవార్డులు నాలుగు 1వ ప్రతిభ, 2 రెండవ ప్రతిభ, 2 మూడవ ప్రతిభ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా వీరవల్లిపాలెం సర్పంచ్ సలాది బుచ్చిరాజుకు పలువురు అభినందనలు తెలిపారు.