టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ ధనాధన్ వార్ ప్రారంభమైంది. దుబాయ్.. షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ ప్రారంభo అయింది. ఫస్ట్ మ్యాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది.
ఈ జట్లు రెండూ బలమైన జట్లే. ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 సార్లు ఫైనల్స్ కు చేరుకోగా మూడుసార్లు విజయం సాధించింది. ఐదుసార్లు రన్నరప్ గా నిలిచింది. ఇక రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఫైనల్స్ కు చేరుకోగా నాలుగుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఇక ఇదిలా ఉంటె అబుదాబిలో జరుగుతున్న తొలిమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎందుకుంది. ఛేజింగ్ చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ కు పెట్టింది పేరు. ఎలాగైనా అత్యధిక స్కోర్ సాధించి విజయం సాధించాలనే కసితో ఉన్నది ముంబై జట్టు. తక్కువ స్కోర్ కు కట్టడి చేసి ఈజీగా ఛేజింగ్ చేయాలని చూస్తోంది చెన్నై జట్టు. 2019 వరల్డ్ కప్ సెమిస్ తరువాత ధోని గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారనే విషయం మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.