చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. జనసేన పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: రైతులను, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో ఈ వైసిపి ప్రభుత్వ విఫలమైందని బొలిశెట్టి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెంలో సోమవారం జరిగిన జనసేన పల్లెపోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ చేతకాని వైసీపీ ప్రభుత్వం రైతులను భావన నిర్మాణ కార్మికులను ఒక ఓటు బ్యాంకింగ్ లాగ చూసిందన్నారు. అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ రైతులకు వెన్నుదండుగా ఉందన్నారు. రైతులు పండించిన వరికి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డారన్నారు. భవన కార్మికుల గురించి చెప్పాలంటే కరోనా టైంలో జనసేన తరఫున నిత్యవసర సరుకులు ఇంటింటికి అందించమన్నారు, గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. కరోనా కాలంలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు గురించి కనీసం వారికి సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన నిధులు రాలేదని వాపోయారు. మూడు సంవత్సరాలుగా నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్‌ పెండింగ్‌ ఉన్నాయని, ఇసుక అందుబాటులో లేక కార్మికులకు పని లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండలం అడపా ప్రసాద్, మెట్టఉప్పర గూడెం జనసేన నాయకులు చిటికెన వెంకటేశ్వరరావు, కోలుమాటి గణేష్, మానేసాయి, కట్ట పండు, చిటికెన మురళి, బోయిన రాము, మట్ట చక్రి, రాజేష్ కుమార్, కాసాన బాలు, కాసాన చందు, కట్టా బాబి, కట్ట గణేష్ మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.