ముఖ్యమంత్రి గారూ మూడేళ్ళ మొద్దునిద్ర ఇకనైనా వీడండి

*గుంత కనపడకూడదన్న మీ శాసనం ఏమైంది?

*రాష్ట్రంలో గుంతల్లో రోడ్లు వెతుక్కుంటున్న దుస్థితి

*ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి నడవటానికి రోడ్లు కూడా లేకుండా చేశారు

*పరిపాలన అంటే ప్యాలెస్ లో కూర్చోని పబ్జీ ఆడటం కాదు

*ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనందుకు సిగ్గుపడండి

*శ్రీలంక తరహాలో ప్రజలు ప్యాలెస్ నుంచి తరిమికొట్టే రోజులు ఎంతోదూరంలో లేవు

*గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో జనసేన పార్టీ అగ్ర నేతలు

గుంటూరు: రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట వినపడి మూడేళ్లు దాటిందని, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని పెను సంక్షోభంలోకి నెట్టి అంతా బాగుంది అంటూ ఆత్మవంచన చేసుకుంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూడేళ్ళ మొద్దునిద్ర వీడి వాస్తవ ప్రపంచంలోకి రావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సర్ డిజిటల్ కార్యక్రమాన్ని శుక్రవారం డొంకరోడ్డులో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ పరిపాలన అంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకోవడం కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గుంత కనపడకూడదు అంటూ గత సంవత్సరం ఇచ్చిన శాసనం ఎంతమేరకు అమలుచేసారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు నీ మాయమాటలు సానుభూతి వచనాలు నమ్మి ఒక్క చాన్స్ ఇచ్చినందుకు నడవటానికి రోడ్లు కూడా లేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు. గత సంవత్సరం రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన డిజిటల్ ఉద్యమంతో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని చూసి దేశం యావత్తు నివ్వెరపోయిందని దుయ్యబట్టారు. ఆంద్రప్రదేశ్ లో రోడ్లు ఇంత అద్వాన్నంగా ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రోడ్ల దుస్థితిపై పంపించే ఫొటోలతో ముఖ్యమంత్రి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో నేనున్నాను.. నేను విన్నాను అంటూ పలికిన ప్రగల్భాలు సమస్యల పరిష్కారంలో ఏమయ్యాయన్నారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం చేయాలి అంటేనే ప్రజలు బయపడుతున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల కోట్ల అప్పు చేసినా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో వైసీపీ పరిపాలన చేస్తుందని ధ్వజమెత్తారు. నియంతృత్వఒతో , అరాచక పాలన చేసిన శ్రీలంక పరిస్థితే రాష్ట్రంలో నెలకొనే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి , వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయకపోతే ప్రజలు తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని నాయబ్ కమాల్ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయులు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, వీరమహిళలు హైమ, అరుణ, వరలక్ష్మి, రాధిక, నగర నాయకులు కిరణ్, సాగర్, కిషోర్, నాగరాజు, సూదా నాగరాజు, తోట కార్తిక్, కోటి, మెహబూబ్ బాషా, రాజేష్, బాలు, ఆకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.