ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన చేతగాని పాలనను బయటపెడుతుంది: చొప్ప చంద్రశేఖర్

సింగనమల, ముఖ్యమంత్రి మన సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల సభలో చేసిన ప్రసంగం ఆయన చేతగాని పాలనను బయటపెడుతుంది. ఎందుకంటే గత నెల రోజుల క్రిందట ఈ నియోజకవర్గంలోని నార్పల, సింగనమల మండలాల్లో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో వడగండ్ల వాన్లతో అరటి, మామిడి, మొక్కజొన్న, వరి వంటి పంటలను పూర్తిగా కోల్పోయి అతలాకుతలం అయిన రైతులకు ఏ విధమైన నష్టపరిహారం ప్రకటించలేదు. అసలు వారి గురించి ఊసే లేదు. ఇదేనా రైతు ప్రభుత్వం? ఇక్కడే తెలుస్తోంది గుంట నక్కలు ఎవరో ఒక మాటలో చెప్పాలంటే వీరి పాలనా పరిస్థితి అర్థం అవుతుంది. అన్నం పెట్టమంటే సాయంత్రం రా కల్లు పోస్తాను అన్నట్లు ఉంది. అసలు చిన్న కూతలేరు బ్రిడ్జి కట్టలేని ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి భారీ నిధులు ఇస్తుందంటే నమ్మమంటారా. అసలు ప్రభుత్వం చేయవలసినది ఏమిటి మీరు చేస్తున్నది ఏమిటి ఇప్పటి రోజులలో ప్రతి ఒక్క పల్లె నుంచి పాలిటెక్నిక్, ఐటిఐ మెడికల్ వంటి చదువులు చదువు కలిగిన విద్యార్థులు ఎందరో ఉన్నారు, వారికి ఇప్పటి కాలానుగుణంగా ఒక్కో నియోజకవర్గంలో ఒక ఐటిఐ ఒక పాలిటెక్నిక్ ఒక మెడికల్ కాలేజీలు నిర్మించవలసినది మానేసి ఒక స్వచ్ఛంద సంస్థలాగా 5000 ఇస్తాం, పదివేలు ఇస్తాం అంటూ ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. నాకు ఇంతకంటే చేతకాదు అని ఒప్పుకున్నారు ఇదేనా పాలన 5000 లేక 10000 తో ప్రజల అవసరాలను హక్కులను మభ్యపెడుతూ మీరు అధికారం అందిపుచ్చుకొని ప్రజలపై పన్నుల రూపంతో భారం మోపి ఆ నొప్పి ప్రజలకు తెలియకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. పిల్లి పాలు త్రాగుతూ ఎవరో చూడలేదనుకుంటే పొరపాటు, ఆంధ్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిజాయితీపరులను గుర్తించి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీకి ఓట్లు వేసి భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే మీరు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటూ ఒకరు, ఆయన మావాడే అంటూ మరొకరు చిలక పలుకులు పలుకుతున్నారు. నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలంటే కూడా మీకు భయమేస్తుంది. అది నిజాయితీకున్న పవర్, ఇక దత్తత ఎవర్ని ఎవరు తీసుకుంటారు తొందరలోనే ప్రజలు, కోర్టులు నిర్ణయిస్తాయి. తొందరపడకు ముందర ఉంది మీకు మంచి గుణపాఠం తప్పదు వచ్చే ఎన్నికలలో ముమ్మాటికీ ఇది సత్యం అని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్ అన్నారు.