వైసీపీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన చిలకం మధుసూదన్ రెడ్డి

*కొండల్ని కరిగించేస్తున్న పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన చిలకం మధుసూదన్ రెడ్డి
*పర్యావరణానికి బాటలు వేయాల్సిన ప్రభుత్వం ఇలా కొండల్ని కరిగించేస్తుంటే ఎంచేస్తోంది
*అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ శివారులోని 28 వార్డ్ లో కొండను తవ్వి సొమ్ము చేసుకుంటున్నా.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

రేగాటిపల్లి గ్రామ పంచాయతీ లో ధర్మవరం పట్టణ శివారు లోని ప్రభుత్వ భూమిలో మట్టి కొండను అధికార పార్టీ వాళ్ళు తవ్వుకుని కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు, ఇప్పటికే పేదల భూములు లాక్కుని ఒక కొండపై విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుని ఇంకో కొండను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అభివృద్ధి చెయ్యడం చేతకాక ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలు నిన్ను తిరగబోనివ్వరు అని గుర్తు పెట్టుకోండి. మీరు ఇలానే ప్రజల ఆస్తిని కొల్లగొడుతుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. కొండలను తవ్వకాలు చేసుకోండి అని మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు?. కనీసం రోడ్లు లేని 28 వార్డులో నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు టిప్పర్లు వెళ్లడం వల్ల అంతో ఇంతో ఉన్న మట్టి రోడ్లు కూడా గుంతలు పడి చాలా దరిద్రంగా దారుణంగా తయారయ్యాయి. అధికారులు దీన్ని గమనించి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. కొండ తవ్వకాలు అపకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & పీ.ఏ.సీ సభ్యులు మరియు ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యామ్ కుమార్, రాజ్ ప్రకాష్, బెస్త శ్రీనివాసులు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.